అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం

అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం

రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డిగ్గి బజార్‌లోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరగగా.. నలుగురు సజీవం దహనం అయ్యారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు ఒక్కసారిగా వ్యాప్తించటంతో హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.