మంత్రి ఆధ్వర్యంలో రేపు భారీ ట్రాక్టర్ ర్యాలీ

మంత్రి ఆధ్వర్యంలో రేపు  భారీ ట్రాక్టర్ ర్యాలీ

SS: పెనుకొండలో సోమవారం మంత్రి సవిత ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ జరగనుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం విడుదలను పురస్కరించుకుని ఈ ర్యాలీ పెనుకొండ వై జంక్షన్ నుండి మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని మంత్రి కార్యాలయం పిలుపునిచ్చింది.