VIDEO: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన కలెక్టర్
BHPL: పట్టణ కేంద్రంలోని బిట్స్ పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్‌స్పైర్ మేళాను ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సంంర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం రెండు రోజులు జరగనుందని, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టులు ప్రదర్శించాలని సూచించారు. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.