వైకుంఠ ధామం కాదు.. 'భూ'లోక నరకం

వైకుంఠ ధామం కాదు.. 'భూ'లోక నరకం

NLG: నగరంలోని 19వ డివిజన్ స్మశానవాటిక దుస్థితి దారుణంగా మారింది. కంపచెట్లు పెరిగి అడవిలా మారి, పందులు–పాములు సంచరిస్తున్నాయి. రైల్వే స్టేషన్ సమీపం వల్ల అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి సేవ పెరిగిందని స్థానికుల ఆరోపిస్తున్నారు. మౌలిక వసతులు లేక అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి శుభ్రపరచాలని డిమాండ్ చేస్తున్నారు.