జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా కె.వి.రెడ్డి

ప్రకాశం: జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా దర్శి మండలానికి చెందిన కొత్త మార వెంకటేశ్వర రెడ్డి (కె.వి.రెడ్డి) నియమితులయ్యారు. కె.వి.రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కె.వి.రెడ్డి గతంలో ఏఎంసీ ఛైర్మన్‌గా పనిచేశారని వైసీపీ నాయకులు తెలిపారు. ఆయన నియామకం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.