'ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి'

VZM: రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. గరివిడి పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారి ప్రమాదాల నియంత్రణకు స్టాపర్లు, లైటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత ఎక్కువగా సీక్రెట్ కెమెరాలు పెట్టాలన్నారు.