సాంకేతిక కారణాలతో వెనక్కి మళ్లిన విమానం!

సాంకేతిక కారణాలతో వెనక్కి మళ్లిన విమానం!

ఏడు గంటలు ప్రయాణించిన ఎయిరిండియా విమానం యూటర్న్ తీసుకుంది. లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. సుమారు 7 గంటల ప్రయాణం తర్వాత మార్గమధ్యంలో సౌదీ అరేబియా గగనతలం నుంచి ఉన్నట్టుండి వెనక్కి మళ్లింది. సౌదీ అరేబియా నుంచి లండన్ వెళ్లేందుకు మరో 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశముంది. కానీ సాంకేతిక కారణాలతో విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.