కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు
HYD: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. వీరంతా 4 బస్సుల్లో HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరిచే దిశగా ఇది కీలక పరిణామంగా కనిపిస్తోంది.