ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

CTR: చిల్లకూరు మండలంలోని రైటర్ సత్యం గిరిజన కాలనీలో శనివారం మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి తండ్రి, నానమ్మ దగ్గర ఉంటూ.. గూడూరులోని ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.