పింఛన్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం: గొట్టిపాటి

ప్రకాశం: దేశంలోనే ఏపీ పింఛన్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. దివాకరపురంలో ఆయన మాట్లాడుతూ.. 9నెలల్లో మీ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, ఉచితంగా 3 సిలిండర్లు, 200 పైచిలుకు అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక అందిస్తున్నామని తెలిపారు.