అనుమానాస్పదంగా మృతి చెందిన ఆటోడ్రైవర్
PLD: మాచర్ల పట్టణంలో ఓ వ్యక్తి శుక్రవారం సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని కోడెల శివప్రసాదరావు కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వెంకట పేరయ్య(35)గా పోలీసులు గుర్తించారు. వేరే ఇంటిలో సూసైడ్ చేసుకోవడంతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.