VIDEO: 'పూర్ణపాడు వంతెన పనులు ప్రారంభించాలి'
PPM: పూర్ణపాడు వంతెన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నాయకుడు సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం కొమరాడ మండలం పూర్ణపాడు నుంచి ఆయన మాట్లాడారు. అధికారులు ఎప్పుడూ నీరు ఎక్కువగా ఉందని పనులు జరగవు అని అంటుంటారని ఇప్పుడు నీరు చాలా తక్కువగా ఉందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీపీఎం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.