ఆదోనిలో సర్పంచులు అర్థనగ్న ప్రదర్శన
KRNL: ఆదోని మండలంలోని గ్రామాలను అదే మండలంలో కొనసాగించాలంటూ 16 గ్రామాల సర్పంచులు, MPTCలు ఆదోనిలోని MPDO కార్యాలయం ఎదుట ఇవాళ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని 16 గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలంలో కలుపొద్దని డిమాండ్ చేశారు. పెద్ద హరివాణం మండలం వద్దంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.