రామాలయ నిర్మాణానికి విరాళం అందజేత
ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు గ్రామంలో రామాలయం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి పొన్నం హరికృష్ణ అనే వ్యాపారి రూ. 1,23,456 విరాళం అందజేశారు. ఇవాళ ఉగాది పర్వదినం సందర్భంగా విరాళాన్ని సంబంధించిన నగదను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.