ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆ దేశ పాలనా బాధ్యతలను ముగ్గురు సభ్యుల లీడర్‌షిప్ కౌన్సిల్ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జుడిషియరీ చీఫ్ ఘోలామ్ హుస్సేన్ మొహ్సేనీతో పాటు అలీరజా ఆరీఫ్ (ఆరాఫీ) సభ్యులుగా ఉన్నారు. కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే వరకు ఈ కమిటీయే దేశ వ్యవహారాలను పర్యవేక్షించనుంది.