గ్యాస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
ATP: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని SP జగదీష్ సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపుల్లో ఫేక్ న్యూస్ షేర్ చేసే అడ్మిన్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు నివేదించాలని కోరారు.