రేవంత్ చేతుల మీదుగా ‘అల్లు సినిమాస్’ ప్రారంభం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించిన మల్టీప్లెక్స్‌ను ఈనెల 12న సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద ‘డాల్బీ సినిమా’ స్క్రీన్ ఉండటం విశేషం. మొత్తం 4 స్క్రీన్లతో, అత్యాధునిక 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఉగాది నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.