సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో బుధవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారంతా సన్న బియ్యం అమ్ముకోవద్దని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.