'భూములను లబ్ధిదారులకు సర్వే చేసి చూపాలి'
KDP: బ్రహ్మంగారిమఠం మండలం పరిధిలో 1397 సర్వే నెంబర్‌లోని అసైన్డ్‌మెంట్ లబ్ధిదారులకు భూములను సర్వే చేసి చూపాలని సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నకిలీ రికార్డులు సృష్టించి ఆన్‌లైన్ చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల తహసిల్దార్‌కు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.