ప్రమాదకరంగా అవనిగడ్డ - విజయవాడ రహదారి

ప్రమాదకరంగా అవనిగడ్డ - విజయవాడ రహదారి

కృష్ణా: అవనిగడ్డ కరకట్ట రహదారి ఇప్పుడు వాహనదారులకు మృత్యుమార్గంగా మారింది. యనమలకుదురు నుంచి పులిగడ్డ వరకు సుమారు 60 కిలోమీటర్ల పొడవునా రోడ్డు గుంతలతో, కుంగుబాటుతో అధ్వానంగా తయారైంది. భారీ టిప్పర్లు భారీ లోడుతో వేగంగా వెళ్లడంతో రోడ్డు మరింత దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. కరకట్టకు ఒకవైపు కేఈబీ కాలువ, మరోవైపు కృష్ణానది ఉండటంతో ప్రమాదం ఉందంటున్నారు.