పోలీసులను నిర్భయంగా సంప్రదించాలి: ఎస్పీ

SRCL: మహిళలు, విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా మహిళలను, విద్యార్థినిలను వేధించినట్లయితే 8712656425 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.