వివాదాస్పదంగా రేషన్ డీలర్ల వ్యవహారం
WGL: జిల్లాలో రేషన్ డీలర్ల మధ్య వివాదాలు మరోసారి తలెత్తాయి. ఖిలా WGL మండల రేషన్ డీలర్ల సంఘం నేత ఒకరు తన పదవిని అడ్డం పెట్టుకుని సహచర మహిళా డీలర్లపై కక్ష సాధింపు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా లేని డీలర్లను లక్ష్యంగా చేసుకుని, ఒక అధికారి అండతో తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత మహిళా డీలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.