ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
కృష్ణా: గుడ్లవల్లేరు మండల కౌతవరం గ్రామంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఇమ్రాన్ ఆదివారం పనులను పరిశీలించారు. మట్టి పనులు, చెరువుల మరమ్మత్తులు, కాలువల శుభ్రపరిచే పనులు వంటి కార్యక్రమాలను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి, పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.