గుంతకల్లులో కన్యకా పరమేశ్వరికి విశేష పూజలు

గుంతకల్లులో కన్యకా పరమేశ్వరికి విశేష పూజలు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం కార్తీక మాసం 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు.