ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ చమురు డిపోలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. తమ డిపోలపై మళ్లీ దాడులు చేస్తే గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడతామని హెచ్చరించింది. అదే జరిగితే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధర 200 డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. కాగా ఇరాన్‌పై మరోసారి భీకర దాడులు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.