ఘనంగా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం
VZM: శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవంలో ఆదివారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. పూల్ బాగ్ మారుతి ధ్యాన మందిరం నందు నిర్వహించిన పంచసూక్త హోమాలు, సంక్షేపారాయణ హోమం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. శ్రీ సీతారాముల దివ్య అనుగ్రహం విజయనగర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.