నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

తిరుపతి టౌన్ డివిజన్ మంగళం రూరల్ పరిధిలో విద్యుత్ కేబుల్స్ మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ డివిజన్ ఈఈ విన్నకోటి చంద్ర శేఖరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రనగర్ సమీప ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.