జిల్లాలలో కాంగ్రెస్ హవా
వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. ప్రధాన పట్టణాల్లో సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి: కొడంగల్: 12 వార్డుల్లో 10 సాధించింది. తాండూరు: 36 వార్డుల్లో 19 కైవసం చేసుకుంది. వికారాబాద్: 34 వార్డుల్లో 18+1 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటింది. పరిగి: ఇక్కడ హంగ్ ఏర్పడింది. 18 వార్డులలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 సీట్లు కైవసం చేసుకుంది.