'బాబు షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

'బాబు షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ 16వ వార్డులో సోమవారం 'బాబు షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. జగనన్న హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని విమర్శలు గుప్పించారు.