తగ్గిన వరద ఉధృతి.. కొనసాగుతున్న రాకపోకలు

SRPT: కోదాడ-అనంతగిరి గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు అలుగు పూర్తిగా తగ్గిపోయింది. రెండు రోజులుగా వాగు దాటి ఎందుకు ఇబ్బందులు పడ్డ ప్రజలు వరద తగ్గడంతో శనివారం ఎలాంటి సమస్యలు లేకుండా వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కోదాడ ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ మార్గంలో బస్సులను నడపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.