లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. RGIA అవుట్ పోస్ట్ ఇన్ స్పెక్టర్, SI ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోరూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.