IND vs SA: చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఆలౌట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బ్యాటర్లలో మార్‌క్రమ్(31), రియాన్ రికెల్టన్(23), ముల్డర్(24) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 5, సిరాజ్ 2, కుల్దీప్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.