'కాఫీ లియిజాన్ వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి'

'కాఫీ లియిజాన్ వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి'

ASR: కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలని కోరుతూ కాఫీ లియిజాన్ వర్కర్లు అరకు టీడీపీ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొరకు వినతిపత్రం అందజేశారు. పాడేరు డివిజన్ లో పనిచేస్తున్న వీరు, ప్రస్తుత రూ.15 వేల జీతం చాలడం లేదని, ట్రావెల్ అలవెన్స్, ప్రమాద బీమా, కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని దొన్ను దొర హామీ ఇచ్చారు.