VIDEO: జనగామలో తెలంగాణ ప్రోమో రన్
JN: జిల్లా కేంద్రంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ ప్రోమో రన్’ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి, డీసీపీ రాజేంద్ర నాయక్ ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఈనెల 7న జరగనున్న ‘తెలంగాణ రన్’కు సన్నాహకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2K, 5K, 10K విభాగాల్లో రన్నర్లు పాల్గొన్నారు.