VIDEO: రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలి: కోనేరు శశాంక్

NZB: కోటగిరి నుంచి ఎల్గొండ వెళ్లే రోడ్డు పక్కన నిర్మిస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ కోరారు. తహసీల్దార్ గంగాధర్‌ను కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. రైస్ మిల్ రోడ్డుకు దగ్గరగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో రైస్ మిల్లులకు వచ్చే లారీలు రోడ్డుపై నిలిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు.