'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'
CTR: జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు, గాలులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తుఫాన్‌పై ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 30, డిసెంబర్ ఒకటో తేదీన జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.