కరెంట్ షాక్.. తండ్రి, కొడుకు మృతి

SDPT: చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తుండగా కరెంట్ తీగ తగలడంతో తండ్రి, కొడుకు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.