సరదాగా మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు వంటి ఖర్గ్ ద్వీపంపై సరదాగా మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందని తెలిపారు. అయితే, అక్కడి చమురు క్షేత్రాలను మాత్రం టచ్ చేయలేదని వెల్లడించారు.