పొగాకు పంట సాగును నిషేధించడం జరిగింది: ఏవో

BPT: అద్దంకి మండలంలోని రైతులు ఈ ఏడాది నల్లబర్లి, తెల్ల బర్లి పొగాకు పంటలను సాగు చేయవద్దని ఏవో వెంకటకృష్ణ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కొన్ని కంపెనీలు రైతుల వద్దకు వెళ్లి పొగాకు సాగు చేయమని బాండ్లు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పొగాకు పంట సాగును నిషేధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.