ఏపీఎంపై దాడిని ఖండించిన ఉద్యోగులు

ఏపీఎంపై దాడిని ఖండించిన ఉద్యోగులు

KDP: గుర్రంకొండ ఏపీఎం రజనీకుమారిపై జరిగిన భౌతిక దాడిని ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం బుధవారం డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని వారు కోరారు.