VIDEO: ప్లాన్ ప్రకారమే దాడి.. ఆరుగురిపై కేసు నమోదు
NGKL: బిజినపల్లి మండలం మంగనూరులో మంగళవారం నసీమా బేగం, ఆమె కుమారుడిపై జరిగిన దాడి ఉద్రిక్తతకు దారితీసింది. అల్లుడి కుటుంబ సభ్యులు గుంపుగా వచ్చి కర్రలతో దాడి చేయడంతో నసీమా తీవ్రంగా గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. బాధితురాలి భర్త వజీర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై FIR నమోదు చేశారు.