తిర్యాణి ఎస్సైగా వెంకటేష్ బాధ్యతలు స్వీకరణ

ASF: తిర్యాణి మండల నూతన ఎస్సైగా వెంకటేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రత పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం ఉన్న నేరుగా తమకు వచ్చి కలవొచ్చని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.