మూసి ఉధృతి.. పోచంపల్లి- బీబీనగర్‌కు రాకపోకలు బంద్

VIDEO: భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసి నది ప్రవాహం భారీగా పెరిగింది. లోలెవల్ వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి - బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వంతెనకు ఇరువైపులా భారీకేడ్లను ఏర్పాటు చేసి, మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.