నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

NLR: దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దన్నారు.