గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

MNCL: బెల్లంపల్లి కన్నాలబస్తీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయని కాలనీవాసులు తెలిపారు.