VIDEO: ఆస్తికోసం మేనకోడళ్లపై ట్రాక్టర్‌తో హత్యాయత్నం
సూర్యాపేట జిల్లా బరాకత్ గూడెంలో ఇవాళ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వ్యక్తి సైకోగా మారి సొంతవాళ్లపైనే హత్యాయత్నం చేశాడు. కొన్నాళ్లుగా తన సోదరితో పొలం వివాదం నడుస్తుండడంతో వరి పొలం కోసేందుకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్‌పై ఉపేందర్ రెడ్డి దాడికి యత్నించాడు. తన సోదరి కూతుర్లపై ట్రాక్టర్ ఎక్కించాడు. బాధితులు మునగాల పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.