CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క

MLG: తాడ్వాయి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.