ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై ఎస్పీ దిశ నిర్దేశం
KDP: ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులకు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి గొడవలు, అవాచనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలు జరగాలని పేర్కొన్నారు. ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.