VIDEO: 'మరో తిరుమలగా కొండ బిట్రగుంట'
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రం మరో తిరుమలగా అభివృద్ధి చెందాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఎమ్మెల్యే అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మహాప్రాకారం నిర్మాణం, కోనేరు అభివృద్ధి, ప్రహరీ గోడ పనులు వేగవంతం చేయాలన్నారు.