ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ

BPT: తిమ్మరాజుపాలెం గ్రామం వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, ఓ మినీ లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనా స్థలాన్ని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. స్థానికులను, పోలీసులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.